![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో శనివారం నాటి ఎపిసోడ్ ట్విస్ట్ లతో సాగింది. నాగార్జున గ్లామర్ గా రెడీ అయి వచ్చేశాడు. వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. సంజనా అండ్ ఫ్లోరా మధ్య ఇష్యూ ఒకటి, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవలు హైలైట్ గా నిలిచాయి.
మొదటగా ఇమ్మాన్యుయల్ ని నాగార్జున లేపాడు. తను గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా.. అగ్నిపరీక్షలో ఒక సంకల్పంతో గుండు చేయించుకుంటే నువ్వు అంత మాట అంటావా.. అతని సంకల్పాన్ని హేళన చేస్తావా అని నాగార్జున అడిగాడు. అయ్యో సర్ నేను అంత హర్ట్ అవుతారంటే నేను అనేవాడ్ని కాదని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇతను నిజంగానే సరదాగా అన్నాడని హౌస్‌లో ఎంత మంది అనుకుంటున్నారని నాగార్జున హౌస్‌లో ఉన్న వాళ్లని అడుగగా.. హౌస్‌లో ఉన్న వాళ్లంతా చేతులు ఎత్తారు. చూశావా హరీష్.. హౌస్‌లో ఉన్న వాళ్లే కాదు.. బయట ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారని నాగార్జున అన్నాడు. నవ్వించడం తన హాబీ.. గుండు అంకుల్ అనే మాట నవ్వించడానికే తప్ప బాడీ షేమింగ్ కాదని నాగార్జున అన్నాడు. ఆ మాటతో ఇమ్మాన్యుయల్ ఏడ్చేశాడు. దాంతో నాగ్.. చూడు ఆడియన్స్ అంతా నీ పక్కనే ఉన్నారు.. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు.. చాలా సరదాగా అన్నావ్ తప్ప.. రాంగ్‌గా అనలేదని జనం నమ్మారు.. నువ్వు ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు. కామెడీ చెయ్.. కానీ హద్దులు దాటొద్దు.. ఆలోచించి కామెడీ చెయ్ అని అందరితో ఇమ్మూకి నాగార్జున చప్పట్లు కొట్టించాడు.
రెడ్ ప్లవర్ అని ఇమ్మాన్యుయల్ ని మాస్క్ మ్యాన్ హరీష్ అన్న వీడియో చూపించాడు నాగార్జున. సార్ దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు అని అన్నాడు. దాంతో నాగార్జున.. ‘నేను నిన్ను అడగలేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత హౌస్ కాల్ తీసుకున్నారు. అది బ్యాడ్ వర్డ్ అని హౌస్‌లో ఉన్న వాళ్లు చెప్పారు. భరణి అయితే కుండబద్దలు కొట్టినట్టుగా తప్పు సార్ ఆ పదం అని అన్నాడు. దమ్ము శ్రీజ అయితే.. ఫన్నీగా అన్నట్టుగా ఉంది అని అన్నది. లేదు సర్.. ఆయన డబుల్ మీనింగ్‌లో అన్నారని సంజనా అంది. ఆ మాటతో హరీష్. మంచి మాటలు మీ దగ్గర నుంచే వినాలంటూ నాగార్జున ముందే ఫైర్ అయిపోయాడు. దాంతో నాగార్జున.. నేను మాట్లాడుతున్నా.. రాష్ టాక్ వద్దని హరీష్ ని నాగార్జున అన్నాడు. గుండు అంకుల్‌కి సారీ చెప్పించుకున్నప్పుడు.. రెడ్ ఫ్లవర్‌కి చెప్పాల్సిన పని లేదా అని నాగార్జున అడుగగా.. సారీ బ్రదర్.. అవసరం అయితే ఈ షో నుంచి క్విట్ అవుతానని మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు.
దాంతో నాగార్జున మాస్క్ మ్యాన్ హరీష్ చేసిన బ్యాడ్ కామెంట్ల వీడియో అందరికి చూపించాడు. 'తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి.. నేను వాళ్లని ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అనుకున్నా.. కానీ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది' అని మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడాడు. ఆ వీడియో చూపించి చెడుగుడు ఆడుకున్నారు నాగార్జున. దాంతో హరీష్.. నాకు ఆడ మగ సమానమే.. ఆడాళ్లను తక్కువ చేయలేదని అన్నాడు. హౌస్ లోని వాళ్ళని అడుగగా అందరు హరీష్ మాడ్లాడింది తప్పని చెప్పారు. 'ఇతను అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.. భరణి, ఇమ్మానుయేల్‌ని అబ్బాయిలు కాదు.. అమ్మాయిలు అని అవమానిస్తూ మాట్లాడారు.. డీ గ్రేడ్ కాదు.. ఈ గ్రేడ్ చేసి మాట్లాడారు' అని సంజనా అంది. సర్ నేను అలా అనలేదు సర్.. నా ఉద్దేశం అది కాదు.. ఇద్దరు మగవాళ్లు ఒక ఆడవాళ్లు అనే అన్నానని హరీష్ అడ్డంగా వాదించడంతో నీతో వాదించలేనురా బాబూ అన్నట్టుగా నాగార్జున చేతిలో ఉన్న సుత్తిని కిందికి వదిలేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ నుండి సోషల్ మీడియాలో మాస్క్ మ్యాన్ హరీష్ పై ఫుల్ నెగెటివ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. మీకేమనిపిస్తోంది.. మగాళ్ళని ఆడాళ్ళంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అనడం కరెక్టేనా లేదా కామెంట్ చేయండి.
![]() |
![]() |